logo

Super Star Krishna: మెతుకుసీమతో నటశేఖరుడి అనుబంధం

నటశేఖరుడు కృష్ణకు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉంది. 30 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చిన సందర్భంలో కృష్ణ.. ఎన్టీఆర్‌తో కలిసి తమ అభిమానుల సహకారంతో విరాళాలు సేకరించారు.

Updated : 16 Nov 2022 11:04 IST

సూపర్‌ స్టార్‌ కృష్ణతో చిద్రుప్ప ప్రభుగౌడ్‌

సిద్దిపేట, సంగారెడ్డి అర్బన్‌, రామాయంపేట: నటశేఖరుడు కృష్ణకు ఉమ్మడి జిల్లాతో అనుబంధం ఉంది. 30 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చిన సందర్భంలో కృష్ణ.. ఎన్టీఆర్‌తో కలిసి తమ అభిమానుల సహకారంతో విరాళాలు సేకరించారు. సిద్దిపేట ప్రాంతంలో అప్పట్లో రూ.14 వేలు వసూలయ్యాయి. అభిమానులంతా కలిసి హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోకు వెళ్లి నగదు ఇచ్చారు. పట్టణంలోని వెంకటేశ్‌ కళామందిర్‌లో ఎన్‌కౌంటర్‌ సినిమాను వీక్షించారు.

* సంగారెడ్డికి చెందిన మాజీ సీడీసీ అధ్యక్షుడు చిద్రుప్ప ప్రభుగౌడ్‌ 1982లో ఉమ్మడి జిల్లా కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన ఏలూరు ఎంపీగా ఉన్న సమయంలో ప్రభుగౌడ్‌ అక్కడ ఇన్‌ఛార్జిగా పని చేశారు.

* రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌కు మేనకోడలు మీనాతో కలిసి పలుమార్లు వచ్చారు. 30 ఏళ్ల క్రితం ఇక్కడి ఆయుర్వేద ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించారని నాటు వైద్యుడు రామకిష్టయ్య గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు