logo

ముగిసిన వైజ్ఞానిక ప్రదర్శన..

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సృజనకు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే, వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడే ప్రయోగాలు, పరిశోధనలు చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు.

Published : 27 Nov 2022 01:47 IST

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన

మెదక్‌, న్యూస్‌టుడే: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సృజనకు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే, వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడే ప్రయోగాలు, పరిశోధనలు చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. శనివారం వెస్లీ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టపడితే ఉజ్వల భవిత సాధ్యమన్నారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.10లక్షలతో జిల్లాకు సైన్స్‌ సంచార వాహనాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్‌రావు మాట్లాడుతూ.. చిన్నారులు వారికి నచ్చిన రంగంలోనే ముందుకు వెళ్లేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలో 600పైగా నమూనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఆయా అంశాల్లో విద్యార్థులు తమ మేథస్సుకు పదునుపెట్టి ప్రదర్శనలు సిద్ధం చేశారని అన్నారు. ఎంఈవో నీలకంఠం,  వైద్యులు పెంటాగౌడ్‌, ఉపాధ్యాయ సంఘాల నేతలు సంగయ్య, శ్రీనివాస్‌, సుదర్శనమూర్తి, ఎల్లం, శ్రీనివాస్‌, ఆయా కమిటీల బాధ్యులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌, అంజాగౌడ్‌, కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

బహుమతుల ప్రధానం.. : జిల్లా కేంద్రమైన మెదక్‌లోని గోల్‌బంగ్లాలో మూడు రోజుల పాటు కొనసాగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో కొలువుదీరిన నమూనాలను న్యాయనిర్ణేతలు పరిశీలించి ఉత్తమమైన వాటిని ఎంపికచేశారు. ఏడు ఉప అంశాల్లో జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతో పాటు ఇన్‌స్పైర్‌, సెమినార్‌, వ్యాసరచన పోటీల్లో విజేతలకు  ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని