logo

ఆగిన మనవడి గుండె.. అనాథగా నాయనమ్మ

తనవారందరినీ కోల్పోగా ఉన్న ఒక్క మనవడితో బతుకీడిస్తోంది ఆ నాయనమ్మ. ఇంతలో గుండెజబ్బుతో బాధపడుతున్న ఆ మనవడు మృతిచెందడంతో నాయనమ్మ అనాథగా మారింది. వివరాలు..

Published : 27 Nov 2022 01:47 IST

నాయనమ్మతో శ్రీకాంత్‌

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: తనవారందరినీ కోల్పోగా ఉన్న ఒక్క మనవడితో బతుకీడిస్తోంది ఆ నాయనమ్మ. ఇంతలో గుండెజబ్బుతో బాధపడుతున్న ఆ మనవడు మృతిచెందడంతో నాయనమ్మ అనాథగా మారింది. వివరాలు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కు చెందిన శ్రీశైలం (20) చిన్నతనం నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు అనసూయ, రాజయ్యలు ఏళ్లకిందట చనిపోయారు. దీంతో రాజయ్య తల్లి లక్ష్మమ్మ.. మనవడు శ్రీశైలంకు అన్నీతానై పెంచింది. వీరి దీనగాథపై 2021 జూన్‌ 10న ‘తోడుంటానన్న మనుమడికి గండం!’ శీర్షికన ‘ఈనాడు’లో మానవీయ కథనం ప్రచురితమైంది. దీనికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు స్పందించి నిమ్స్‌లో చేర్పించాలని అధికారులకు సూచించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేసినా బతకడని తేల్చారు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగొచ్చేశారు. వృద్ధాప్య పింఛన్‌తో మనవడిని పోషించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం అతడి గుండె ఆగిపోవడంతో లక్ష్మమ్మ ఒంటరిగా మారింది. ఇన్నాళ్లు సానీక్ష ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ధరావత్‌ శివనాయక్‌, లయన్స్‌ క్లబ్‌, హోప్‌ టీం సభ్యులు అండగా నిలుస్తూ వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు ప్రియదర్శిని ఉచితంగా వైద్యం, మందులు అందించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, స్థానికులు లక్ష్మమ్మకు సాయం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని