logo

వంతెన పనులు ముమ్మరం

జిల్లాలో 44వ జాతీయ రహదారి మనోహరాబాద్‌, తూప్రాన్‌, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా మొత్తం 55 కిలోమీటర్లు ఉంటుంది.

Updated : 29 Nov 2022 07:12 IST

న్యూస్‌టుడే, చేగుంట

గోడలు నిర్మించేందుకు కాలువ తవ్వకం

జిల్లాలో 44వ జాతీయ రహదారి మనోహరాబాద్‌, తూప్రాన్‌, మాసాయిపేట, చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల మీదుగా మొత్తం 55 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో రెండు వరుసలుగా ఉన్న రోడ్డును  2006లో నాలుగుగా విస్తరించి, తూప్రాన్‌, చేగుంట వద్ద బైపాస్‌ నిర్మించారు. తూప్రాన్‌ మండలం నాగులపల్లి, చేగుంట మండలం రెడ్డిపల్లి చౌరస్తాల వద్ద నిత్యం ప్రమాదాలు సంభవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు రెడ్డిపల్లి వలయం వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరుతూ వచ్చారు.

రూ.19 కోట్లతో..

ఈ విషయంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కేంద్ర రవాణాశాఖ మంత్రికి వినతులు సమర్పించారు. ఎట్టకేలకు 2021 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వంతెన మంజూరు చేసి, రూ.19 కోట్లు  కేటాయించింది. టెండర్‌ నిర్వహణలో జాప్యం కొనసాగింది. ఎనిమిది నెలల కిందట పనులు ప్రారంభించారు. రహదారిపై ప్రస్తుతం ఉన్న వంతెనలను విస్తరించారు. అనంతరం సర్వీసు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. వంతెన నిర్మాణానికి  రోడ్డుకు  ఇరువైపులా సర్వీసు రోడ్డులో గోడల నిర్మాణానికి మట్టిని తొలగించారు. త్వరలోనే బీటీ వేసి ఆ మార్గంలోనే ఇటు హైదరాబాద్‌, అటు నాగపూర్‌ నుంచి వచ్చే వాహనాలు పంపించనున్నారు. సుమారు అరకిలోమీటరు మేర వంతెన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నార్సింగి మండలం జప్తిశివునూర్‌ సంకాపూర్‌ చౌరస్తా వద్ద ఉపరితల వంతెన మంజూరైంది ఇందుకోసం రూ.29 కోట్లు కేటాయించారు. ఇక్కడా పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ రెండు చోట్ల నిర్మాణాలు పూర్తిచేస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు