అందని రవాణా భత్యం
ప్రభుత్వ పాఠశాలలకు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం అందిస్తోంది. ఇందుకోసం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆన్లైన్ దరఖాస్తులు చేయించాలి
చిన్నారుల ఎదురు చూపులు
న్యూస్‌టుడే, మెదక్ అర్బన్
సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలకు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం అందిస్తోంది. ఇందుకోసం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆన్లైన్ దరఖాస్తులు చేయించాలి. 2022-23కు సంబంధించి జూన్‌లో బడులు ప్రారంభంకావడంతో ఈ ప్రక్రియకు విద్యాశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు, ప్రాథమికోన్నత మూడు కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటేనే వర్తింపజేస్తారు. పాఠశాల నుంచి బస్సు సౌకర్యమున్న గ్రామాల వారికి చెల్లించరు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయినా అర్హులైన వారికి నగదు జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా కమిటీ సభ్యులు సర్వే నిర్వహించి పాఠశాలలకు దూరంగా ఉన్న వివిధ గ్రామాలకు చెందిన 1,460 మందిని అర్హులుగా గుర్తించారు. ఆవాస ప్రాంతం నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దూరంలో, పాఠశాలకు సైకిల్, ఆటో, ఇతర వాహనాలపై వెళ్తున్న ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తారు. అర్హుల జాబితాను ఆయా పాఠశాలలకు పంపించి, ఆగస్టు నుంచి అర్జీలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 837 మంది వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు.
బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతాయి
- రమేష్‌కుమార్, జిల్లా విద్యాధికారి
బడుల్లో జులై నెలాఖరు వరకు ప్రవేశాలు కొనసాగాయి. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ప్రభుత్వం నిధులు మంజారు చేయగానే నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయి.
నిబంధనలు ఇలా..
విద్యార్థి హాజరు శాతం 75కు పైగా ఉండాలి. వరుసగా పది రోజులు రాకపోతే వర్తించదు. హాజరు వివరాలను పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుడు, మండల స్థాయిలో ఎంఈవో, జిల్లా స్థాయిలో విద్యాధికారి ధ్రువీకరించి పంపాల్సి ఉంటుంది. బ్యాంకులో విద్యార్థితో పాటు తల్లిదండ్రుల పేరుతో జాయిట్ అకౌంట్ ఉండాలి. ఆ వివరాలను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలి.
జిల్లాలో ఇలా..
ప్రభుత్వ పాఠశాలు: 898
మొత్తం విద్యార్థులు: 70 వేలు
అర్హులైన వారు: 1,460
ఆన్లైన్లో నమోదు చేసినవారు: 837
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. నిర్వహణ ఎక్కడో రేపే తేలనుందా..?
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్