logo

కాసులు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు

వాహనాలకు నంబరు ప్లేట్ల విషయంలో కొందరు ఆసక్తి మేరకు కొత్త పంథా అనుసరిస్తారు. నంబర్లలో వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు.

Published : 29 Nov 2022 06:20 IST

సంగారెడ్డి అర్బన్‌: వాహనాలకు నంబరు ప్లేట్ల విషయంలో కొందరు ఆసక్తి మేరకు కొత్త పంథా అనుసరిస్తారు. నంబర్లలో వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు. వారి ఆసక్తి రవాణా శాఖకు కాసులు కురిపిస్తోంది. కొందరు కోరుకున్న నంబరును దక్కించుకోవడానికి ఆన్‌లైన్‌లో పోటీపడుతున్నారు. ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి ముందుకొస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్‌లో ఆర్‌టీఏ యూనిట్‌ కార్యాలయాలున్నాయి. సంగారెడ్డి ఆర్‌టీఏ పరిధిలో 10 కొత్త ఫ్యాన్సీ నంబర్లను సోమవారం ఆన్‌లైన్‌లో పెట్టారు. టీఎస్‌ 15ఎఫ్‌జీ 9999 నంబరును ఆన్‌లైన్‌ వేలంలో రూ.3,11,004కు ఓ వాహనదారు దక్కించుకోవడం విశేషం. వారు ముందస్తుగా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకు రుసుంల రూపేణా రూ.1,55,000 ఆదాయం వచ్చిందని, వేలం వేయగా రూ.7,44,741 ఆదాయం సమకూరినట్టు ఉప రవాణా అధికారి సీహెచ్‌ శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు