logo

ఉద్యోగం పేరిట ‘సైబర్‌’ మోసం.. సొమ్ము స్వాహా

సైబర్‌ నేరగాడి మాయమాటలకు ఓ మహిళ మోసపోయారు. సంబంధిత వివరాలను సీపీ శ్వేత సోమవారం వెల్లడించారు.

Published : 29 Nov 2022 06:20 IST

సిద్దిపేట: సైబర్‌ నేరగాడి మాయమాటలకు ఓ మహిళ మోసపోయారు. సంబంధిత వివరాలను సీపీ శ్వేత సోమవారం వెల్లడించారు. ఇటీవల పట్టణానికి చెందిన జహీరా జాబిన్‌ చరవాణికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి సందేశం రాగా తెరిచారు. ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం కల్పిస్తామని సదరు వ్యక్తి నమ్మబలికాడు. ఈ మేరకు టెలీగ్రామ్‌ గ్రూప్‌లో ఆమెను జత చేశాడు. డబ్బు సులువుగా సాధించే విధానాన్ని వివరిస్తూ దృశ్యాలు పంపించగా నమ్మిన మహిళ వివిధ దశల్లో రూ.98,103 ఆన్‌లైన్‌లో చెల్లించారు. ఫోన్‌ చేయగా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు జాతీయ హెల్ప్‌ లైన్‌ నం. 1930 ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోల్పోయిన దాంట్లో రూ.76,001 ఫ్రీజ్‌ అయ్యాయి.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు