సీఎం నేతృత్వంలో ముప్పై ఏళ్ల కల సాకారం
కునూరుపల్లిని మండలం చేయాలని ఈ ప్రాంతం ప్రజలు చేసిన ముప్పై ఏళ్ల పాటు పోరాటం చేశారు. వారి కల సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం అయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు
కుకునూరుపల్లి మండల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, సిద్దిపేట టౌన్, గజ్వేల్ గ్రామీణ, కొండపాక గ్రామీణ (కుకునూరుపల్లి): కుకునూరుపల్లిని మండలం చేయాలని ఈ ప్రాంతం ప్రజలు చేసిన ముప్పై ఏళ్ల పాటు పోరాటం చేశారు. వారి కల సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం అయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కుకునూరుపల్లి మండలం కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుంటే సిద్దిపేట జిల్లా, కుకునూరుపల్లి మండలం ఏర్పాటు అయ్యేదా.. అని ప్రశ్నించారు. బతుకమ్మ దసరా పండుగ కలసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో అంతగా కుకునూరుపల్లి వాసుల్లో చూస్తున్నానన్నారు. ఇక నుంచి స్థలాల రిజిస్ట్రేషన్ కోసం కొండపాక, గజ్వేల్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రైలు రాబోతుందని తెలిపారు. అంతకుముందు తెరాస నాయకులు భారీ ర్యాలీతో హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కొత్త తహసీల్దార్‌గా ఆశాజ్యోతి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని అభివృద్ధిని ఆపేందుకు ఎఫ్ఆర్బీఎం కింద రూ.15 వేల కోట్లు, బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని మనకు రావాల్సిన రూ.6 వేల కోట్లను కక్షతో భాజపా ఆపి వేసిందని తెలిపారు.
మార్చిలో మిట్టపల్లికి రైలు
కేంద్రంలోని ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైందని, ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయించే పార్టీ అని విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా పరిశ్రమ కార్మికులు బీఎంఎస్ నుంచి తెరాస కార్మిక విభాగంలో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో వారికి తెరాస కండువాలు వేశారు. మిట్టపల్లి పారిశ్రామిక వాడగా మారిందని, వచ్చే మార్చిలో ఈ ప్రాంతానికి రైలు రానుందన్నారు. సిద్దిపేట సుడా కార్యాలయం ఆవరణలో రూ.39 లక్షలతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో సిద్దిపేటలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా దశ సహస్ర పార్థివ లింగాలతో లింగార్చన జరిగింది. శ్రీరామ పాదుకలను స్వామికి మంత్రి సమర్పించారు. గజ్వేల్ ఆత్మకమిటీ ఛైర్మన్ గజ్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ తెరాస నాయకుడు ఊడెం కృష్ణారెడ్డిని నియమిస్తూ రిమ్మనగూడ వద్ద ఛైర్మన్, డైరక్టర్ల నియామక పత్రాన్ని మంత్రి అందించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ ఛైరపర్సన్ రోజాశర్మ, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి, మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, జడ్పీటీసీ సభ్యుడు పంగ మల్లేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, గడాధికారి ముత్యంరెడ్డి, ఎంపీపీ సుగుణ, జడ్పీటీసీ సభ్యుడు అశ్విని, వైస్ ఎంపీపీ దేవి రవీందర్, సుడా అధ్యక్షుడు మారెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచులు జయంతి, కిరణ్‌కుమార్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు