నేర వార్తలు
ఓ శుభకార్యానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డులో రేజింతల్ సిద్ధివినాయక కమాన్ వద్ద చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి..
భార్యకు తీవ్ర గాయాలు
న్యాల్‌కల్ న్యూస్‌టుడే: ఓ శుభకార్యానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి భర్త మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్- బీదర్ రోడ్డులో రేజింతల్ సిద్ధివినాయక కమాన్ వద్ద చోటుచేసుకుంది. హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్, కుటుంబీకుల కథనం ప్రకారం.. న్యామతాబాద్ గ్రామానికి చెందిన బూచన్‌పల్లి సంజీవరెడ్డి(45) భార్య ఈశ్వరమ్మతో కలిసి 28న ద్విచక్ర వాహనంపై జహీరాబాద్‌లో శుభకార్యానికి వెళ్లి సాయంత్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తుండగా రేజింతల్ శివారులోని శ్రీ సిద్ధివినాయక ఆలయ ప్రధాన ముఖ ద్వారం వద్ద అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో జహీరాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సంజీవరెడ్డి మృతిచెందాడు. ఈశ్వరమ్మ చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులోపడి కార్మికుడు..
నారాయణఖేడ్: నిజాంపేట గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు అలిగే పోచయ్య(40) సోమవారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లోస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి ప్రమాదవశాత్తు ముదిర్యాల్ చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సర్పంచి జగదీశ్వరాచారి ఇచ్చిన పోలీసులకు సమాచారం అందించి గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టగా పోచయ్య మృతదేహాం లభించింది. అతడికి 20 ఏళ్లకిందçË వివాహం కాగా.. కొన్నినెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో తల్లి ఆగమ్మ వద్దే ఉంటున్నాడు.
విద్యార్థి బలవన్మరణం
కంది, న్యూస్‌టుడే: తనను తోటి విద్యార్థుల ఎదుట అవమానించారని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన ప్రకారం.. కంది మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి(16). ఈనెల 11వ తేదీన పాఠశాలకు వెళ్లి పాఠాలు వింటుండగా, ఓ గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు బడికి వచ్చి సదరు విద్యార్థిని, తోటి విద్యార్థుల ఎదుట తిట్టారన్నారు. దీంతో మనోవేదనకు గురై ఇంటికి వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అదే రోజు సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తమ కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు .తమ కొడుకు మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!