logo

విజ్ఞానమేళాతో నైపుణ్యాలు బహిర్గతం

బాలల్లో దాగిన నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు విజ్ఞానమేళాలు దోహదం చేస్తాయని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ అన్నారు.

Published : 02 Dec 2022 02:02 IST

నమూనాను తిలకిస్తున్న జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ,
ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

సిద్దిపేట, న్యూస్‌టుడే: బాలల్లో దాగిన నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు విజ్ఞానమేళాలు దోహదం చేస్తాయని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలనాశక్తి, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. మాజీ రాష్ట్రపత్రి దివంగత అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సిద్దిపేట విద్యాహబ్‌గా మారేందుకు మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సైన్స్‌ ద్వారా సాధించే ఫలితాలు సామాన్యుడికి సైతం చేరేలా కృషి చేయాలన్నారు. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ఎంత ఎదిగిగా ఒదిగి ఉండాలన్నారు. జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ పూర్ణిమ, శాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం నమూనాలను పరిశీలించి విశేషాలు తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.  నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్‌ గౌరవ్‌కుమార్‌ వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించారు.

వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు

ఆకట్టుకునే నృత్యాలతో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని