logo

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

హత్యా నేరం రుజువు కావడంతో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చిందని జహీరాబాద్‌ సీఐ భూపతి తెలిపారు.

Published : 02 Dec 2022 02:02 IST

కోహీర్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ: హత్యా నేరం రుజువు కావడంతో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చిందని జహీరాబాద్‌ సీఐ భూపతి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు.. కోహీర్‌ మండలం కవేలికి చెందిన అలీముద్దీన్‌, సద్దాం సోదరులు. వీరిద్దరు కలిసి 2015లో చిన్న లారీ(డీసీఎం) కొనుగోలు చేసి మూడు సంవత్సరాలు సరకు రవాణా చేశారు. 2018లో సద్దాం డీసీఎంను రూ.4.5 లక్షలకు అమ్మేశాడు. ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకుని అన్న అలీముద్దీన్‌కు వాటా డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. 2018 డిసెంబరు 6న జరిగిన గొడవలో సద్దాంను అలీముద్దీన్‌ కర్రతో కొడుతుండగా అదే గ్రామానికి చెందిన సైఫుద్దీన్‌ అడ్డు వెళ్లాడు. ఆయనకు తీవ్ర గాయమైంది. చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. సీఐ సైదేశ్వర్‌ విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు అలీముద్దీన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల అపరాధ రుసుం విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్‌.శశిధర్‌రెడ్డి తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని