logo

సృజనాత్మకతకు ప్రోత్సాహం చైతన్యానికి దోహదం

విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీయాలంటే వారి అభిరుచి, ఆసక్తిని గుర్తించాలి. ఇలా వారిలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించేలా, వెలికితీసేలా గిరిజన గురుకులాల ఆధ్వర్యంలో ఇగ్నైట్‌ ఫెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

Published : 02 Dec 2022 02:02 IST

వేషధారణలో విద్యార్థులు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీయాలంటే వారి అభిరుచి, ఆసక్తిని గుర్తించాలి. ఇలా వారిలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించేలా, వెలికితీసేలా గిరిజన గురుకులాల ఆధ్వర్యంలో ఇగ్నైట్‌ ఫెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఇందుకు వేదికైంది.

10 గురుకులాల నుంచి..

మెదక్‌, నిజామాబాద్‌, ఎల్లారెడ్డి జిల్లాల నుంచి పది గురుకులాలకు చెందిన 700 మంది విద్యార్థులు ఈ ఫెస్ట్‌లో పాల్గొంటున్నారు. 18 రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా గురుకులాల నుంచి తరలివచ్చిన విద్యార్థులతో సందడిగా మారింది. ప్రతి పోటీలో విద్యార్థులు భాగస్వాములు కావడానికి ప్రయత్నించారు.

వ్యాసరచణ పోటీలో..

పురస్కారాలు..

ఆయా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.500, ద్వితీయ రూ.400, తృతీయ రూ.300 అందజేస్తారు. యూత్‌ పార్లమెంట్‌ పోటీలు ఆంగ్లం, తెలుగులో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని సైనిక్‌ స్కూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. ఈనెల 15, 16 తేదీలలో జరుగనున్నాయి.

పార్లమెంట్‌పై అవగాహన..

గురుకులంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల్లో వికాసం పెంచేందుకు కృషి చేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు అలవర్చడమే యూత్‌ పార్లమెంట్‌ పోటీల లక్ష్యం. పార్లమెంట్‌ నిర్వహణ తీరును పిల్లలకు అర్థమయ్యేలా ప్రదర్శన సాగుతుంది. పిల్లలే అన్నీ తామై వ్యవహరిస్తారు. విధివిధానాలపై అవగాహన ఏర్పడుతుంది. చట్టాలు, శాసనాలు ఎలా రూపొందిస్తారో తెలుస్తుంది. వివిధ అంశాలు లేవనెత్తి వాటిపై చర్చ సాగిస్తుంటారు. సమాజంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. గురుకులంలో గురువారం నిర్వహించిన విద్యార్థుల యూత్‌ పార్లమెంట్‌ అందరినీ ఆకట్టుకుంది. నాయకుల ప్రశ్నలు, స్పీకర్‌ సమాధానాలు, మంత్రులు, అధికారుల సందడితో ఆసక్తిగా సాగింది.

కఠిన పదాలకు..

వేడుకలో భాగంగా ఉపన్యాస పోటీలు సైతం నిర్వహించారు. నిర్దేశించిన అంశాలపై వివిధ గురుకులాల విద్యార్థులు ప్రసగించి ఆకట్టుకున్నారు. ఇక కఠిన ఆంగ్ల పదాలకు స్పెల్లింగ్‌ చెప్పేలా స్పెల్‌Ë-బీ పోటీలు చేపట్టారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కొన్ని కఠిన పదాలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. పలు గురుకులాలకు చెందిన విద్యార్థులు పలు నమూనాలను ప్రదర్శించారు. కొన్నింట విద్యార్థులు బృందంగా ప్రయత్నించారు.


వ్యర్థాల అర్థాన్ని మారుస్తూ..

ఎల్లారెడ్డి గురుకులానికి చెందిన అఖిల ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కొబ్బరి పీచు, కాగితం, వాడిన పెన్నులు, ఇతరత్రా వాటితో అందమైన వస్తువులు తయారుచేస్తున్నారు. వివిధ ఆకృతులను తయారుచేసి భళా అనిపిస్తున్నారు. కొబ్బరి పీచుతో నెమలి, బాతు రూపాలను, పాత దుస్తులతో చేతి సంచులు తీర్చిదిద్ది ప్రదర్శించారు. ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు