logo

పేదలకు ఆరోగ్య భరోసా: ఎమ్మెల్యే

అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చేయూత అందిస్తున్నట్లు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 03 Dec 2022 01:23 IST

మీ-కోసంలో వినతులు స్వీకరిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌, న్యూస్‌టుడే: అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చేయూత అందిస్తున్నట్లు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 89 మందికి రూ.29.43 లక్షల విలువైన సహాయనిధి చెక్కులు బాధితులకు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యభద్రతే ధ్యేయంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ కార్పోరేట్‌ తరహా వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జరిగిన మీ-కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. రెండు పడకగదుల ఇళ్లు, పింఛన్లు, రెవెన్యూ అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అక్టోబరులో 407 ప్రసవాలు చేసినందుకు ఆమె డీసీహెచ్‌ పి.చంద్రశేఖర్‌, వైద్యులు శివదయాళ్‌ను శాలువాతో సత్కరించారు. మెదక్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ అంజాగౌడ్‌, ఏడుపాయల దేవస్థానం కమిటీ ఛైర్మన్‌ బాలాగౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు మాధవి, పాపన్నపేట ఏఎంఈ ఛైర్మన్‌ వెంకటరామిరెడ్డి, వైస్‌ ఎంపీపీలు విష్ణువర్ధన్‌రెడ్డి, సుజాత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని