logo

భూవిక్రయం తీరుపై ఆందోళన

ఏళ్ల క్రితం సాదా బైనామా ద్వారా తాము కొనుగోలు చేసిన భూమిని పట్టాదారులు వేరొకరికి అక్రమంగా విక్రయించారంటూ బాధితులు శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు.

Published : 03 Dec 2022 01:23 IST

వంటావార్పుతో నిరసన చేపట్టిన వారిని చెదరగొడుతున్న పోలీసులు

ధూల్మిట్ట(మద్దూరు), న్యూస్‌టుడే: ఏళ్ల క్రితం సాదా బైనామా ద్వారా తాము కొనుగోలు చేసిన భూమిని పట్టాదారులు వేరొకరికి అక్రమంగా విక్రయించారంటూ బాధితులు శుక్రవారం వంటావార్పుతో నిరసన తెలిపారు. అనంతరం పురుగు మందు డబ్బాలతో ఆందోళన నిర్వహించారు. వీరికి గ్రామస్థులు మద్దతు తెలిపారు. తోర్నాలకు చెందిన గొడుగు మల్లయ్య ముప్పై ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దర్శనం మల్లేశం, రాజయ్య నుంచి 6.22 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు. గొడుగు మల్లయ్య కుమారులు చంద్రయ్య, శ్రీనివాస్‌, కనకయ్య సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాదాబైనామాలు రిజిస్ట్రేషన్‌ అవసరమైన డబ్బులు లేక కాలేదు. చేర్యాలకు చెందిన బీర్ల గణేశ్‌, ఉత్కూరి అమర్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయింది. తాము కొన్న భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ బాధితులు తహసీల్దార్‌ గోపాల్‌కు ఫిర్యాదు చేసినా ప్రక్రియ పూర్తయింది. సాగు చేసుకుంటున్న భూమిని తమకు ఇప్పించాలని బాధితులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి పంపించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ గోపాల్‌తో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా కోర్టు ద్వారా ఆదేశాలు వస్తేనే రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే అధికారం ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని