మనోధైర్యమే మకుటాయమానం
కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తు.. అనారోగ్యంతో ఇంకొందరు.. కారణం ఏదైనా అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పలు సంస్థలు మేమున్నామంటూ అండగా నిలిచి ఆదుకుంటున్నాయి.
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, మెదక్
కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తు.. అనారోగ్యంతో ఇంకొందరు.. కారణం ఏదైనా అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి పలు సంస్థలు మేమున్నామంటూ అండగా నిలిచి ఆదుకుంటున్నాయి. కొందరు వైకల్యాన్ని లెక్క చేయక తాము అనుకున్నది చేతల్లో చూపించారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కథనం.
సదరం నిర్వహణ..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ప్రతి నెలా సదరం శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరు శిబిరాలు జరుగుతున్నాయి. వైద్యులు వైకల్య శాతాన్ని పరీక్షించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు రూ.3,016 పింఛనుగా ఇస్తోంది. సంగారెడ్డిలో 15,275, మెదక్‌లో 8,712, సిద్దిపేటలో 15,000, వికారాబాద్‌లో 13,020 మంది లబ్ధిదారులు ఉన్నారు.
చదువుకు తోడ్పాటు
జహీరాబాద్‌కు చెందిన వెంకటయ్య మాస్టారు.. రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఎవరిపై ఆధారపకూడదని పాఠశాలను స్థాపించారు. 1984 నుంచి బడిని నడుపుతూ 20 మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించారు. పలువురు దివ్యాంగులు, తల్లిదండ్రులు లేని అనాథలకు ఉచితంగా చదివిస్తున్నారు. దివ్యాంగుడిగా సేవా భావంతో బడిని నడుతున్న వెంకటయ్య మాస్టారుకు దాత ఎకరం స్థలం బహూకరించారు. అందులో బడి నిర్మించి బోధిస్తున్నారు.
న్యూస్‌టుడే, జహీరాబాద్ అర్బన్
వెనుకడుగు వేయకుండా..
తాను అకున్నది సాధించేందుకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నారు చేగుంట మండలం పులిమామిడికి చెందిన చింతకింది ముత్యాలు. పుట్టుకతోనే ఎడమ కాలులో లోపం ఉండగా తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ముత్యాలు మాత్రం ఇవన్నీ కాదని తమ నాలుగున్నర ఎకరాలను నమ్ముకున్నారు. వరి సాగు చేస్తున్నారు. అన్ని పనులను స్వయంగా చేసుకుంటారు. మోపెడ్ నడిపించుకుంటూ పొలానికి వెళ్తుంటారు. రాత్రి వేళ సైతం పొలానికి వెళ్లి నీటితడులు అందిస్తుంటారు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. వినూత్న పద్ధతులు పాటిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
న్యూస్‌టుడే, చేగుంట
బాసటగా నిలిచి..
సంగారెడ్డికి చెందిన శ్రీనివాసరాజు, సరిత దంపతులది మధ్యతరగతి కుటుంబం. తమ పెద్దబాబు మానసిక దివ్యాంగుడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వృథాప్రయాసే. బాబును మానసిక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఫీజులు భరించలేక తిరిగొచ్చారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని సబిత మానసిక దివ్యాంగుల పాఠశాలను ఐదేళ్ల కిందట ప్రారంభించగా 40 మంది ఉన్నారు. శ్రీనివాసరాజు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విద్యాశాఖలో పనిచేస్తుండగా సరిత పాఠశాల నిర్వహిస్తున్నారు. ఏడాది కిందట బాబు మృతిచెందడంతో వారి బాధలు వర్ణనాతీతం. మిగతా పిల్లల్లో తమ బాబును చూసుకుంటున్నామని సరిత తెలిపారు.
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్
స్వయంగా చూసుకుంటూ..
ధారూర్ మండలం గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన వెల్చాల బాలయ్య.. 15 ఏళ్ల కిందట చెట్టుపై నుంచి కింద పడగా చేయి విరగ్గా.. దాన్ని తొలగించారు. తాను పెద్దగా చదువుకోకపోయినా సాగును నమ్ముకున్నారు. తమ మూడెకరాలలో వివిధ పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సాగు పనులన్నీ ఆయనే స్వయంగా చూసుకుంటారు. దున్నడం మొదలుకొని నీళ్లు పారించడం, మందుల పిచికారీ వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. వారందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.
న్యూస్‌టుడే, ధారూర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!
-
World News
Covid-19: దీర్ఘకాలిక కొవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి
-
India News
కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్