logo

అమ్మకు ధీమా...!

మాతృ మరణాలు జిల్లాలో తగ్గుముఖం పట్టాయి... ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం లోపించకుండా అవగాహన, సంరక్షణ పథకాలు, ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది.

Updated : 04 Dec 2022 06:12 IST

మాతృ మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం

మాతృ మరణాలు జిల్లాలో తగ్గుముఖం పట్టాయి... ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, పౌష్టికాహారం లోపించకుండా అవగాహన, సంరక్షణ పథకాలు, ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతోనే ఇది సాధ్యమైంది. ప్రసవాల సమయంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు ప్రత్యేక దృష్టి సారించడంతో తగ్గుతున్నాయి. మాతృ మరణాల తగ్గుదలలో ‘జాతీయ నమూనా సర్వే’లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం నిలిచింది. ఈ నేపథ్యంలో గర్భిణులకు అందిస్తున్న జిల్లా వైద్యారోగ్యశాఖ సేవలపై ప్రత్యేక కథనం..

పోర్టల్‌లో వివరాలు...

గర్భం దాల్చిన విషయం తెలిసిన వెంటనే సదరు మహిళ వివరాలను మాతాశిశు పోర్టల్‌లో నమోదు చేయడంలో ఆశా కార్యకర్తలు ముందుంటున్నారు. వారిని ప్రతి శుక్రవారం వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం, రక్తహీనత నివారణకు పోలిక్‌ యాసిడ్‌ మాత్రలిచ్చి వేసుకునేలా చూస్తున్నారు.

కేసీఆర్‌ కిట్‌..

గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో మూడునెలల పాటు వైద్య పరీక్షలు చేయించుకున్న వెంటనే పోషకాహారం తీసుకునేలా ఆమె వ్యకిగత ఖాతాలో మొదట రూ.3 వేలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమై ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12వేలు ఇవ్వడంతో పాటు శిశు పోషణకు అవసరమైన సామగ్రితో కూడిన కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నారు.

అంగన్‌వాడీలు..

గర్భిణులకు ఈ కేంద్రాల్లో రోజు వారీ కోడిగుడ్లు, పప్పు దినుసులు వంటి పోషకాహారం అందిస్తున్నారు. మాతా శిశు సంరక్షణ, సుఖప్రసవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి కేంద్రంలో న్యూట్రీగార్డెన్‌ ఏర్పాటు చేసి, అందులో ఆకుకూరలు, కూరగాయలను పెంచుతున్నారు.
సత్వర నమోదు నుంచి... : జిల్లాలో గత రెండేళ్లుగా మాతృ మరణాలు తగ్గుముఖం పట్టాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రుల్లో గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించడం, గర్భస్థ దశ నుంచి ప్రసవం వరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంరక్షణ పథకాలు అమలు చేస్తుంది. మాతృ మరణాల నివారణకు క్షేత్రస్థాయి నుంచే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మాతృ మరణాల్లో ప్రధాన కారణంగా భావిస్తున్న రక్తహీనతను అధిగమించేందుకు ఐరన్‌ మాత్రలు అందిస్తున్నారు. హైరిస్క్‌ ఉన్న గర్భిణులను ముందే గుర్తించి, వారికి ప్రతి నెలా వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందేలా చూడడం వంటివి మాతృమరణాల తగ్గుదలకు దోహదపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని