logo

న్యాయమూర్తి సమక్షంలో ప్రేమపెళ్లి

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో యువతీ యువకుడు మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీని శనివారం ఆశ్రయించారు. నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి అనిత, ఇరువురి కుటుంబాలకు చెందిన వారితో చర్చించి ప్రేమజంట ఒక్కటయ్యోలా చేశారు.

Published : 04 Dec 2022 02:01 IST

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో యువతీ యువకుడు మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీని శనివారం ఆశ్రయించారు. నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి అనిత, ఇరువురి కుటుంబాలకు చెందిన వారితో చర్చించి ప్రేమజంట ఒక్కటయ్యోలా చేశారు. మండలంలోని మూసాపేట గ్రామంలో వేర్వేరు కులాలకు చెందిన వెంకగోని గోపాల్‌, తలారి రోజా ప్రేమించుకున్నారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో తమకు  ప్రాణహాని ఉందని, పెళ్లికి సహకారం కోరుతూ బాధితులు నర్సాపూర్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీని ఆశ్రయించారు. కమిటీ ఛైర్మన్‌, న్యాయమూర్తి అనిత ఇరువర్గాల కుటుంబసభ్యులను కోర్టుకు పిలిపించి మాట్లాడారు. ఇద్దరూ మేజర్‌ కావడంతో చట్ట బద్ధంగా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందని సూచించారు. పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో ఎస్సై గంగరాజు, న్యాయవాదులు స్వరూపరాణి, ఆనంద్‌కుమార్‌, రాజుల సమక్షంలో దండలు మార్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని