logo

ఉర్దూ మాధ్యమం.. ఆరుగురే విద్యార్థులు..

సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అయినప్పటికీ అరకొరగానే విద్యార్థుల సంఖ్య నమోదవుతోంది. 

Published : 04 Dec 2022 02:01 IST

సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అయినప్పటికీ అరకొరగానే విద్యార్థుల సంఖ్య నమోదవుతోంది. కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న ఉర్దూ మాధ్యమంలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. శనివారం ‘న్యూస్‌టుడే’ పాఠశాలను సందర్శించగా ఈ విషయం వెలుగు చూసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉర్దూ మాధ్యమంలో నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతిలో నలుగురు, నాలుగు, ఐదు తరగతుల్లో ఒకరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులున్నారని ఉపాధ్యాయురాలు ఫాతిమా తెలిపారు. రెండు, మూడు తరగతుల్లో ఎవరూ లేరని శనివారం ఇద్దరు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కరోనా సమయంలో రెండేళ్లు ఉపాధ్యాయురాలు లేకపోవడంతో తెలుగు మాధ్యమ పాఠశాలలోనే విద్యాభ్యాసం జరిగినట్లు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం జగన్నాథం తెలిపారు. ఈ విషయమై ఎంఈవో బుచ్చానాయక్‌ దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులు ఎందరున్నా పాఠశాలను నిర్వహించాల్సిందే అని అన్నారు. గ్రామస్థుల సహకారంతో పిల్లల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే, కౌడిపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని