logo

సైబర్‌ నేరాల్ని ఛేదించిన పోలీసులు

మండల పరిధిలో ఇటీవల జరిగిన మూడు సైబర్‌ నేరాలను ఛేదించినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డితో కలిసి శనివారం వివరాలు వెల్లడించారు.

Published : 04 Dec 2022 02:01 IST

మూడు కేసుల్లో.. రూ.88,500 స్వాధీనం

ఇద్దరి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్‌, ఎస్సై భాస్కర్‌రెడ్డి

చేర్యాల, న్యూస్‌టుడే: మండల పరిధిలో ఇటీవల జరిగిన మూడు సైబర్‌ నేరాలను ఛేదించినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డితో కలిసి శనివారం వివరాలు వెల్లడించారు. చేర్యాలకు చెందిన బచ్చు మురళి, తాళ్లపల్లి రమేశ్‌ గూగల్‌పే ఖాతాలను హ్యాక్‌ చేసి రూ.80వేలు కాజేసిన సంఘటన నెల రోజుల క్రితం చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో మండల వ్యవసాయాధికారి పేరు చెప్పి చేర్యాల ఎరువుల దుకాణ యజమాని శ్రీనివాస్‌రెడ్డి వద్ద మూడు నెలల క్రితం రూ.3,800 కాజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ మూడు కేసులను బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌ నేరాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారంగా నింధితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు కుమ్రంభీం జిల్లా రవీంద్రనగర్‌కు చెందిన బాలుడు(17), మరొకరు సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన తాడూరి పృథ్వీరాజ్‌. శనివారం మధ్యాహ్నం వీరు స్థానిక బస్టాండు వద్ద అనుమానాస్పందంగా కన్పించగా పోలీసులు పట్టుకొని విచారించారు. ఆన్‌లైన్‌ ద్వారా పలువుర్ని మోసగించినట్టు ఒప్పుకొన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి, రూ.88,500 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మోసపూరిత మాటలకు, చరవాణికి వచ్చే సందేశాలకు స్పందించవద్దని సూచించారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని