logo

ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు

మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు టీఎస్‌ఐఐసీ అధికారులు ఇంటి స్థలాలను నిర్వాసితులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ తెలిపారు.

Published : 07 Dec 2022 01:45 IST

తూప్రాన్‌లో అధికారులతో మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి రమేశ్‌కుమార్‌

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు టీఎస్‌ఐఐసీ అధికారులు ఇంటి స్థలాలను నిర్వాసితులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రమేశ్‌ తెలిపారు. మంగళవారం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని టీఎస్‌ఐఐసీ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్‌, కూచారం, జీడిపల్లి గ్రామాల పరిధిలో అప్పటి ప్రభుత్వం 2006లో 891 ఎకరాల అసైన్డ్‌ భూమిని రైతుల నుంచి పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించింది. 400మంది వరకు నిర్వాసితులు ఉండగా వారికి ఎకరా రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఇంటికో ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇళ్ల పట్టాల కాగితాలు ఇచ్చి స్థలాలను కేటాయించలేదని మంత్రి హరీశ్‌రావును నిర్వాసితులు కోరగా ఆయన జిల్లా కలెక్టర్‌, టీఎస్‌ఐఐసీ అధికారులను ఆదేశించారు. స్థలాన్ని చదును చేయాలని సూచించారు. ఆర్డీవో సాయిరాం, టీఎస్‌ఐఐసీ అధికారి నజీబ్‌అహ్మద్‌, తహసీల్దార్లు బిక్షపతి, జ్ఞానజ్యోతి, నాయబ్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, కిషోర్‌, ఆర్‌ఐ సునీల్‌ తదితరులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించండి

తూప్రాన్‌: తూప్రాన్‌లో నిర్మించిన రెండు పడక గదుల్లో నివాసం ఉంటున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని అదనపు పాలనాధికారి రమేశ్‌కుమార్‌ అన్నారు. తూప్రాన్‌లోని రెండు పడక గదుల ఇళ్లను ఆయన పరిశీలించారు. విద్యుత్తు సరఫరా, సదుపాయాల కల్పనలో జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని