logo

సుందరీకరణ.. ఏదీ కార్యాచరణ?

పట్టణాల్లో ప్రధాన కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడంలేదు.

Published : 23 Jan 2023 01:29 IST

న్యూస్‌టుడే, మెదక్‌, టౌన్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌

పట్టణంలోని ధ్యాన్‌చంద్‌ చౌరస్తా ఇలా

ట్టణాల్లో ప్రధాన కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడంలేదు. జిల్లాలోని నాలుగు పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఈ అంశంపై కథనం

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీలున్నాయి. ఈ రెండు పట్టణాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన చౌరస్తాల్లో ఉన్న మహనీయుల విగ్రహాలను తొలగించారు. తూప్రాన్‌లో గతేడాది నర్సాపూర్‌ చౌరస్తాలో రూ.30 లక్షలతో ఐలాండ్‌, ఏనుగుపై నెమలి బొమ్మను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. పోతిరెడ్డిపల్లి కూడలిని వదిలేశారు.

అంబేడ్కర్‌ చౌరస్తా

మెదక్‌లో మూడేళ్లు కావస్తున్నా..

జిల్లా కేంద్రంలోని బోధన్‌, ప్రధాన తపాలా కార్యాలయం, రాందాస్‌, నర్సాపూర్‌ చౌరస్తాల్లో మహనీయుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకునేవి. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తొలగించి పుర కార్యాలయంలో వాటిని ఉంచారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. రోడ్డు పనులు పూర్తయి మూడేళ్లు కావస్తున్నా, కూడళ్లను అభివృద్ధి చేయడం లేదు. అయితే రాందాస్‌ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కొందరు కమిటీగా ఏర్పడి విరాళాలు సేకరించి పనులు చేపట్టారు.

నర్సాపూర్‌ పట్టణంలోని సంగారెడ్డి-మెదక్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి రెండు ఏళ్లు దాటింది. ఈ విషయమై కమిషనర్‌ వెంకటగోపాల్‌ను వివరణ కోరగా. ఇటివలే బాధ్యతలు స్వీకరించానని, పరిశీలించి పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రామాయంపేటలో వివేకానంద, అంబేడ్కర్‌ కూడలిలోని విగ్రహాల గద్దెలు శిథిలమవుతున్నాయి. ఈ విషయమై కమిషనర్‌ యాదగిరిని వివరణ కోరగా మెదక్‌-ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అవి పూర్తయ్యాక సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. తూప్రాన్‌ పట్టణంలోని పోతిరెడ్డి పల్లి చౌరస్తా గురించి కమిషనర్‌ మోహన్‌ను వివరణ కోరగా.. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామన్నారు.


పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తాం.

జానకిరామ్‌సాగర్‌, కమిషనర్‌, మెదక్‌

పట్టణంలోని ప్రధాన చౌరస్తాలను అందంగా మార్చాలనే ఆలోచన ఉంది. ఈ విషయమై పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి సుందరీకరణ పనులతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మహనీయుల విగ్రహాలపై చర్చిస్తాం. ప్రతిపాదనులు సిద్ధం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని