భూవివాదంతో వృద్ధుడి ఆత్మహత్య
భూవివాదంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఆత్మహత చేసుకున్న ఘటన మిరుదొడ్డిలో చోటుచేసుకుంది.
మిరుదొడ్డి, న్యూస్‌టుడే: భూవివాదంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఓ వృద్ధుడు ఆత్మహత చేసుకున్న ఘటన మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ శ్రీధర్‌గౌడ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మద్దెల కిష్టయ్య (75) ముప్పై ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మర్పడగ విజేందర్‌రెడ్డి వద్ద 1452 సర్వే నంబరులో గల ఏడు ఎకరాల సాగు భూమిని సాదా బై నామా ప్రకారం కొనుగోలు చేశాడు. కిష్టయ్య కుటుంబ సభ్యులైన భార్య నర్సవ్వ, కుమారుడు నర్సింలుతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కిష్టయ్య పలుమార్లు విక్రయదారుడితో చెప్పినా కాలయాపన చేశాడు. 2002లో విజేందర్‌రెడ్డి మృతి చెందాడు. విక్రయదారుడి భార్య అజిత బంధువులైన విజయ, విజేందర్‌రెడ్డితో కలిసి ఆదే భూమిని మిరుదొడ్డికి చెందిన బెక్కంటి దేవయ్య, బెక్కంటి మురళికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఏడు ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామంటూ దేవయ్య, మురళితో పాటు స్థిరాస్తి వ్యాపారులు దొమ్మాటకు చెందిన డప్పు శివరాజం, వెంకటాపురానికి చెందిన దయాకర్, నందు, మిరుదొడ్డికి చెందిన కుమార్, మేడ్చల్‌కు చెందిన రామేశ్వర్, హైదరాబాద్‌కు చెందిన మర్పడగ రవీందర్‌రెడ్డి కాస్తులో ఉన్న కిష్టయ్య కుటుంబ సభ్యులను భూమిలోంచి వెళ్లగొట్టారు. బోరుబావి, మోటారు ధ్వంసం చేశారు. భూమిలోంచి వెళ్లకుంటే చంపుతామని బెదిరించారు. ఈ నెల 17న వ్యవసాయ క్షేత్రంలో వృద్ధుడు రసాయన గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుమారుడు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు..
చేర్యాల: ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయిన రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చేర్యాల మండలం చిట్యాలలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. చిట్యాలకు చెందిన గీకురు కనకయ్య(52) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది అతివృష్టి కారణంగా పంట దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు. కూతురు, కుమారుడి పెళ్లిళ్లకు చేసిన ఖర్చులు, సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో కొన్నాళ్లుగా మానసికంగా వేదన చెందుతున్నాడని గ్రామస్థులు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ విషయమై ఎస్సై భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫిర్యాదు అందలేదని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-02-2023)
-
Crime News
Crime News: మైనర్ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!