logo

208 మందికి నైపుణ్య పరీక్షలు

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం అన్నారు.

Published : 23 Jan 2023 01:29 IST

వల విసిరేందుకు సిద్ధమైన మత్స్యకారులు, పరిశీలిస్తున్న అధికారులు, నాయకులు

నంగునూరు, న్యూస్‌టుడే: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం అన్నారు. మత్య్సశాఖలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రం నంగునూరులోని మైసమ్మ చెరువులో ఘనపూర్‌, కోనాయిపల్లి, నంగునూరు గ్రామాలకు చెందిన అర్హులైన 208 మంది మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలైన వల విసరడం, వల అల్లిక వేయడం, ఈత కొట్టడం, లోతైన ప్రాంతంలో తెప్పపై చేపలు పట్టడం, పెద్ద వలతో సామూహికంగా చేపలు పట్టడం వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మత్స్యశాఖలో సభ్యత్వ నమోదుకు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌పామ్‌ రైతు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంతరెడ్డి, ముదిరాజ్‌ మహాభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుపాకుల బాల్‌రంగం, రాష్ట్ర కార్యదర్శి ధర్మా, మండలాధ్యక్షుడు పిల్లి నారాయణ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని