మత్స్యకారుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం
‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం’ ద్వారా మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాలా స్పష్టం చేశారు. సోమవారం మెదక్, నర్సాపూర్‌లలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
నర్సాపూర్‌లో కేంద్ర మంత్రికి చేపలు అందిస్తున్న మత్స్యకారులు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మురళీయాదవ్ తదితరులు
మెదక్ టౌన్, నర్సాపూర్, న్యూస్‌టుడే: ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం’ ద్వారా మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాలా స్పష్టం చేశారు. సోమవారం మెదక్, నర్సాపూర్‌లలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 3500 సొసైటీల్లో కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో పథకాలు వర్తించడం లేదన్నారు. జీవాలకు వైద్య సేవలు త్వరగా అందాలనే ఉద్దేశంతో 4 వేల సంచార వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’తో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని చెప్పారు. సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ సబ్బండవర్గాల మద్దతుతో తెలంగాణ సాధించినా, అన్యాయమే జరిగిందని వాపోయారు. భవిష్యత్తులో నర్సాపూర్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఇన్‌ఛార్జి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్, నర్సాపూర్ పుర అధ్యక్షుడు మురళీయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, నర్సాపూర్ నియోజకవర్గ కన్వీనర్ మల్లేశ్‌గౌడ్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ మధు, పట్టణాధ్యక్షుడు ప్రసాద్, నాయకులు రఘువీరారెడ్డి, కౌన్సిలర్లు రాజేందర్, బుచ్చేశ్, సురేశ్, యాదగిరి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/02/23)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు