logo

ప్రజల్లో చైతన్యానికే యాత్ర: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రను జయప్రదం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.

Published : 27 Jan 2023 04:09 IST

మాట్లాడుతున్న రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు, నాయకులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రను జయప్రదం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ముందుకు సాగనున్నట్లు చెప్పారు. భాజపా మతోన్మాద రాజకీయాలు, పెరిగిన నిత్యావసర ధరలు తదితరాలన్నింటిని ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువస్తామన్నారు. ప్రతినిధులు ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను యాత్రలో ఎండగడుతామని పేర్కొన్నారు. ఎంపీపీ జ్యోతి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, పట్టణ మండలాధ్యక్షులు అంజీగౌడ్‌, మల్లేశం, నాయకులు హకీం, కిషన్‌గౌడ్‌, శ్రీపతి, మల్లేశ్‌, శ్రీశైలం యాదవ్‌ పాల్గొన్నారు.

అమలుకు నోచని మంత్రి హామీ: కాంగ్రెస్‌

రామాయంపేట, న్యూస్‌టుడే: రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని,  నేటికి నెరవేరలేదని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. మండల పరిధి దంతేపల్లి, లక్ష్మాపూర్‌, కాట్రియాలలో  హాథ్‌సే హాథ్‌జోడో కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ రాజీనామాతోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు పార్టీలో చేరారు. పీసీసీ సభ్యుడు సుప్రభాత్‌రావు మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసే అన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి , మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, యువజన అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బ్లాక్‌ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని