logo

పాలకుల వైఫల్యాలు ప్రజలకు వివరించాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆరోపించారు.

Published : 27 Jan 2023 04:09 IST

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

సమావేశంలో మాట్లాడుతున్న రాజనర్సింహ, నాయకులు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. గురువారం సంగారెడ్డిలో హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి అధ్యక్షతన జరగగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు రుణమాఫీ, దళితులకు సీఎం పదవి, దళితులకు మూడెకరాల భూమి, అందరికీ దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.10లక్షల వరకు రుణాలు ఇస్తామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జన్‌దన్‌ ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని భాజపా హామీ ఇచ్చిందని, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి పేదలపై భారం మోపుతోందని విమర్శించారు. వచ్చేనెల 6 నుంచి నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఇంటింటికీ వెళ్లి పాలకుల  వైఫలాల్యలను ప్రజలకు వివరించాలని  నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌గౌడ్‌,  కాంగ్రెస్‌ నేతలు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం..

జహీరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, దీంతో ప్రజలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్నారని మాజీ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు కొనసాగనున్న హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని గురువారం జహీరాబాద్‌ శివారులోని గుల్షన్‌నగర్‌, మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామాల్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం ఖాయమన్నారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, పార్టీ జహీరాబాద్‌ పట్టణం, మండలం, మొగుడంపల్లి మండల అధ్యక్షులు కండెం నర్సింహులు, నర్సింహారెడ్డి, మహ్మద్‌ మక్సూద్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో గీతారెడ్డి తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని