logo

ప్రగతి సంకల్పం ప్రణాళికతో సాకారం

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల సద్వినియోగంతో ప్రయోజనం చేకూరుతోంది.

Published : 27 Jan 2023 04:09 IST

ఈనాడు, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల సద్వినియోగంతో ప్రయోజనం చేకూరుతోంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుండటం కలిసి వస్తోంది. పలు అంశాల్లో ప్రగతి సాధించి మేటిగా నిలవగా, మరికొన్నింట మాత్రం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కీలక అంశాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రణాళిక అవశ్యం. తాజాగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ఆయా విషయాలను స్పష్టంచేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలోని పరిస్థితిపై ప్రత్యేక కథనం.


దూసుకెళ్తున్నాయ్‌..

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగింది. సంప్రదాయ ఇంధన వనరులు భారంగా మారుతుండటంతో ఈ దిశగా అడుగులు పడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో పలు సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ముమ్మరం చేశాయి. పనితీరు బాగుండటంతో వినియోగం పెరుగుతోంది.


మెతుకుసీమలోనే ఎక్కువ..

శాతాల్లో ఇలా..

నాలుగు జిల్లాల్లో పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలోనే పట్టణ జనాభా ఎక్కువ. మెదక్‌ జిల్లాలో పల్లెల్లోనే అత్యధికులు జీవిస్తున్నారు. రాష్ట్రంలోనే 7.7 శాతం పట్టణ జనాభాతో మెదక్‌ జిల్లా పట్టణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో మూడోస్థానంలో నిలిచింది.


బీమా ప్రయోజనం

రైతులు మరణిస్తే బాధిత కుటుంబాలకు అందిస్తున్న బీమా ఆసరాగా నిలుస్తోంది. రూ.5 లక్షల మేర సాయం అందుతోంది. ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో కలిపి ఈ పథకం ద్వారా 17,143 కుటుంబాలకు ప్రయోజనం దక్కింది. బీమా క్లెయిమ్‌లు ఇలా..


బడి మానేస్తున్నారు..

ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులతో పోలిస్తే హైస్కూల్‌కు వచ్చేసరికి ఎక్కువ మంది విద్యకు దూరమవుతున్నారు. తొమ్మిదో, పదో తరగతులకు వచ్చేసరిగా చదువు మానేస్తున్నారని గుర్తించారు. ఆయా జిల్లాలో ఇలా..


రవాణా వసతి

స్వరాష్ట్రం వచ్చాక రహదారుల బాగుపై ప్రధానంగా దృష్టిసారించారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే దారులను విస్తరించారు. కొత్తగా తారురోడ్లు నిర్మించారు. ఇందులో సిద్దిపేట ముందంజంలో ఉంది. నాలుగు జిల్లాల్లో పంచాయతీరాజ్‌, రహదారులు, భవనాల శాఖకు సంబంధించి మొత్తం 14,887.49 కి.మీ. పొడవున రోడ్లున్నాయి.


పెట్టుబడి సాయం..

రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. తద్వారా సాగుకు ప్రైవేటు అప్పు బాధలు తప్పాయి. రాష్ట్రంలో సంగారెడ్డి రెండోస్థానంలో ఉంది. సిద్దిపేట (5), వికారాబాద్‌ (10), మెదక్‌ (11) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

 


తలసరి ఆదాయం..

ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండటంతో తలసరి ఆదాయం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి మెరుగైన మూడు, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు రాష్ట్రస్థాయిలో వరుసగా 5, 6 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక వికారాబాద్‌ కింది నుంచి మూడింట నిలిచింది.


ఆందోళనకరంగా..

తీవ్రమైన పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారులు రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లాలో అత్యధికులు ఉన్నారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. సంక్షేమ శాఖల అధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారిస్తే మేలు. పోషకాహార లోపమున్న వారి శాతం ఇలా..


రొయ్యల ఉత్పత్తిలో..

మిషన్‌ కాకతీయ ద్వారా నీటి వనరులను పునరుద్ధరించడంతో జలకళను సంతరించుకున్నాయి. కొత్త జలాశయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని