logo

పారదర్శక బదిలీలకు డిమాండ్‌

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 29 Jan 2023 03:10 IST

వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు

మెదక్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బాధ్యులు సంగయ్య, వెంకటరామిరెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌రావు, అజయ్‌కుమార్‌, పీఆర్టీయూ, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌, కృష్ణ, ప్రణీద్‌కుమార్‌, రాజ్‌గోపాల్‌గౌడ్‌ అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. రాజకీయ పైరవీలు సాగుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ప్రక్రియ సాగించాలని కోరారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతికి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా డీఈడీ, టీటీసీ అర్హతలు లేని ఉపాధ్యాయులను చేర్చారన్నారు. దాన్ని సవరించి అర్హుల పేర్లను చేర్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు కోరారు.

ఎస్టీలకు జీవో 33 ద్వారా పెంచిన పదిశాతం రిజర్వేషన్లు ఉపాధ్యాయ పదోన్నతులు, ఖాళీల భర్తీలో సైతం అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తారాసింగ్‌, చెదల్‌ భాస్కర్‌ అదనపు పాలనాధికారిణిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని