ఏళ్లుగా అద్దె భవనమే దిక్కు!
ఆరేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. భవన సముదాయ నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇందుకు భూమిని సైతం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం ఊసే లేకుండా పోయింది.
కేటాయించిన స్థలం అన్యాక్రాంతం
న్యూస్‌టుడే, కౌడిపల్లి
కౌడిపల్లిలో కొనసాగుతున్న గిరిజన గురుకుల పాఠశాల
ఆరేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. భవన సముదాయ నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇందుకు భూమిని సైతం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం ఊసే లేకుండా పోయింది. కేటాయించిన స్థలం అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం విద్యార్థులకు శాపంగా మారింది. మంజూరైనప్పటి నుంచి అద్దె భవనమే దిక్కయింది. ఇది కౌడిపల్లిలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల దుస్థితి.
480 మంది విద్యార్థులు
2017లో సదరు గురుకుల పాఠశాలను మంజూరు చేశారు. అప్పట్లో కౌడిపల్లిలో సరైన భవనం దొరక్కపోవడంతో నర్సాపూర్‌లో ఓ అద్దె భవనంలో ఆర్భాటంగా ప్రారంభించారు. ఏడాది తర్వాత మెదక్‌కు మార్చారు. ఐదేళ్ల పాటు అక్కడి ఓ ప్రైవేటు పాఠశాల భవనంలో నిర్వహిస్తూ వచ్చారు. ఎట్టకేలకు గతేడాది జులైలో కౌడిపల్లి మండల కేంద్రంలోని వాణిజ్య దుకాణ సముదాయంలో ఏర్పాటుచేశారు. ఇందులో ఐదు నుంచి ఇంటర్ వరకు 480 మంది విద్యార్థులు చదువుకుంటూ వసతి పొందుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇరుకు గదుల్లో సర్దుకుపోతున్నారు.
7 ఎకరాలు కేటాయింపు..
గురుకులానికి సొంత భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో మండల పరిధిలోని భుజిరంపేట గ్రామ శివారులోని సర్వే నంబరు 595లో 7 ఎకరాలు గుర్తించారు. స్థానిక రైతులు అభ్యంతం వ్యక్తం చేయగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి అది ప్రభుత్వ భూమి అని తేల్చారు. సదరు భూమిని గురుకుల సొసైటీ అధికారులకు అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా భవన సముదాయానికి రూ.4.2 కోట్లు సైతం మంజూరు చేశారు.
పనుల్లో జాప్యం..
టెండరు వేసి పనులకు ఓ గుత్తేదారుకు అప్పగించారు. పనులు ప్రారంభిస్తున్న దశలో కొంతమంది రైతులు అభ్యంతరం తెలపడంతో ఆపేశారు. ఇక ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు నేనంటే నేనంటే పనులు చేస్తానంటూ పట్టుబట్టడంతో ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పటివరకు పనులు మొదలుపెట్టకపోవడంతో గుర్తించిన స్థలాన్ని ప్రస్తుతం పలువురు ఆక్రమిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు విజ్ఞప్తిచేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి..
గతంలోనే సర్వే చేసి భూమిని గిరిజన సంక్షేమ శాఖకు స్వాధీనం చేశాం. స్థలం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. అప్పగించిన స్థలంలో భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
- కమలాద్రి, తహసీల్దారు, కౌడిపల్లి
ఎమ్మెల్యేకు విన్నవించాం
స్థలం విషయాన్ని ఎమ్మెల్యేకు విన్నవించాం. భుజిరంపేట శివారులో కాకుండా మండల కేంద్రంలో అనువైన స్థలం చూపిస్తానని ఆయన చెప్పారు. భవన నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. వేరే స్థలం కావాలని పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లాం.
- సంపత్‌కుమార్, రీజినల్ కోఆర్డినేటర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
MLC Kavitha: 8 గంటలుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..