ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: సీపీ
ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సీపీ శ్వేత సూచించారు. సిద్దిపేట గ్రామీణ ఠాణాను శనివారం ఆమె సందర్శించారు.
పోలీసు ఠాణాను పరిశీలిస్తున్న శ్వేత
సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించాలని పోలీసు సిబ్బందికి సీపీ శ్వేత సూచించారు. సిద్దిపేట గ్రామీణ ఠాణాను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఠాణా పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, విధి నిర్వహణలో సిబ్బంది పోటీపడి పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడి సాధక బాధకాలను విన్న తర్వాత వారు ఇచ్చే దరఖాస్తుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీ వెంట డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.
సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ప్రతీరోజు వ్యాయామం చేయాలని పోలీసు కమిషనర్ శ్వేత సూచించారు. క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ చేయాలన్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ శరీరానికి శ్రమ కల్పించాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని 5కె, 10కె హాఫ్ మారథాన్, మారథాన్ పరుగుపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మారథాన్ శిక్షకుడు నిరంజన్ పరుగుకు సంబంధించిన మెలకువలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 8 వారాల పాటు రన్నింగ్ సాధన చేసిన తర్వాతే 5కె, 12 వారాల తర్వాత 10కె, 24 వారాల తర్వాత హాఫ్ మారథాన్, మారథాన్ సాధన చేయాలని సూచించారు. వారానికి నాలుగు రోజులు రన్నింగ్, మూడు రోజులు వాకింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ మహేందర్, డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, రమేశ్, ఫణిందర్, ఎస్బీ ఇన్స్‌పెక్టర్ రఘుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత