logo

యోగాతో మానసిక వికాసం

ఆరోగ్యంగా జీవించడానికి, మానసిక వికాసానికి యోగా సాధన ఎంతో కీలకమని జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ అన్నారు.

Published : 29 Jan 2023 03:10 IST

కోమటిచెరువు కట్టపై సాధన

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ఆరోగ్యంగా జీవించడానికి, మానసిక వికాసానికి యోగా సాధన ఎంతో కీలకమని జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ అన్నారు. స్వచ్ఛ సిద్దిపేట, ఆరోగ్య సిద్దిపేట నినాదాలతో పురోగమిస్తున్న తరుణంలో యోగా సిద్దిపేటగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రథ సప్తమి సందర్భంగా శనివారం వ్యాసమహర్షి యోగా సొసైటీ, యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సంయుక్తాధ్వర్యంలో కోమటిచెరువు కట్టపై వేడుకలు నిర్వహించారు. యోగా శిక్షకులు సతీష్‌, సంధ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ అధ్యక్షురాలు మాట్లాడారు. ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్యంగా జీవించటం గొప్ప వరమన్నారు. కార్యక్రమంలో భారాస నాయకులు రాధాకృష్ణశర్మ, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, యోగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పాల సాయిరాం, గౌరవాధ్యక్షుడు అంజయ్య, తపస్‌ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, దంత వైద్యుడు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్‌ సర్వెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎన్జీవో భవన్‌లో శనివారం సామూహిక సూర్య నమస్కారాల సాధన చేశారు. ఈ సందర్భంగా భవన్‌ ప్రధాన కార్యదర్శి నిమ్మ సురేందర్‌రెడ్డి మాట్లాడారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో రథ సప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని