logo

ఆరు రోజులు.. 41 వేలకు పైగా పరీక్షలు

‘కంటి వెలుగు’.. ఎంతో మందికి ఊరటనిస్తోంది. లోపాలను సవరిస్తూ.. మెరుగైన చూపును ప్రసాదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టిన కంటి వెలుగు రెండో విడత.. జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది.

Published : 29 Jan 2023 03:10 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట : ‘కంటి వెలుగు’.. ఎంతో మందికి ఊరటనిస్తోంది. లోపాలను సవరిస్తూ.. మెరుగైన చూపును ప్రసాదిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టిన కంటి వెలుగు రెండో విడత.. జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఆరు రోజుల వ్యవధిలో 41 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించడం అందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా రెండో విడత కింద 18 ఏళ్లు పైబడిన దాదాపు 7 లక్షల మందికి పరీక్షలు నిర్వహించేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సెలవు రోజులు మినహాయిస్తే.. శిబిరాలు కొనసాగుతున్నాయి. జూన్‌ 15వ తేదీ వరకు విడతల వారీగా శిబిరాలు కొనసాగనుండగా.. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ జరుగుతోంది. నిర్వహణ పక్కాగా సాగేలా జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వైద్యాధికారి కాశీనాథ్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో నేత్ర సంబంధిత సమస్యలతో 17,982 మంది బాధపడుతున్నట్లుగా తేలింది. ఈ లెక్కన మొత్తంగా చూస్తే.. 44 శాతం మంది ఆ జాబితాలో ఉండటం గమనార్హం. అనుగుణంగా వైద్యులు దగ్గరి, దూరం చూపు అద్దాలు రెఫర్‌ చేశారు. అందులో దగ్గరి చూపు అద్దాలు అప్పటికప్పుడు అందజేయగా.. దూరం చూపువి ఆర్డర్‌ చేశారు.

ప్రత్యేక శిబిరాలు : జిల్లాలో ఆరు రోజుల వ్యవధిలో పురుషులు 18,919, మహిళలు 22,235 మందికి పరీక్షలు చేశారు. మరోవైపు ప్రత్యేక శిబిరాలపై దృష్టి సారించారు. మూడు రోజుల వ్యవధిలో దాదాపు 400 మంది అధికారులు, ఉద్యోగులను పరీక్షించారు. పోలీసుల సౌకర్యార్థం సోమవారం నుంచి రెండు రోజుల పాటు పోలీసు కమిషనరేట్‌లో శిబిరం నిర్వహించనున్నారు. శిబిరాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తుండగా.. కొన్ని చోట్ల ఆదరణ మేరకు సాయంత్రం పొద్దుపోయే వరకు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి కాశీనాథ్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు మినహాయిస్తే నిత్యం శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో నిర్దేశిత రోజుల్లో జరిగే శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాలో ఇలా..

మొత్తం బృందాలు 45
అదనపు (బఫర్‌) బృందాలు 3
పరీక్షలు 41,154
దగ్గరి చూపు అద్దాల పంపిణీ 10,483
ఆర్డర్‌ చేసిన దూరం చూపు అద్దాల సంఖ్య 7,499


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు