logo

జీవనోపాధి.. సౌకర్యానికి వారధి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి భరోసా కల్పిస్తోంది.

Published : 30 Jan 2023 02:56 IST

‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’లో రూ.18.17 కోట్లు వ్యయం

సంఘాల్లో కొత్త సభ్యత్వాలకు శ్రీకారం

మూడేళ్ల క్రితం మత్స్యకారులకు వాహనాలను  అందజేసిన ఎంపీ, ఎమ్మెల్సీ, నాయకులు

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి భరోసా కల్పిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మత్స్యకారులకు ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ప్రవేశపెట్టి అమలు చేసింది. పథకం అమలులో భాగంగా రాయితీపై మోటారు సైకిళ్లు, ప్లాస్టిక్‌ చేపల కిట్లు, వలలు, తెప్పలు, సంచార చేపల విక్రయ వాహనాలను, మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలకు మార్కెటింగ్‌ సౌకర్యానికి నిధులు మంజూరు చేసి జీవనోపాధి పొందేలా తగు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాయితీ కింద వాహనాలు, ఇతర సామగ్రి కోసం రూ.18.17 కోట్లు పైగా ఖర్చు చేశారు. కొత్తగా సభ్యత్వం పూర్తయితే మరింతమందికి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 284 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20 వేలకు పైగా సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం అర్హులైన వారికి సంఘాల్లో సభ్యత్వం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. నూతన సభ్యత్వాలు అందజేస్తే జిల్లాలో మత్స్యకార్మికుల సంఖ్య మరింత పెరగనుంది. బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం చెల్లిస్తున్నారు. ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరం నీటితో జిల్లాలోని 1306 చెరువులు, కుంటలను నింపడంతో కళకళలాడుతున్నాయి. ఉచితంగా చేప పిల్లలను చెరువులో వదులుతోంది. అవి పెరిగిన తర్వాత గ్రామాల్లోని సంఘాల నేతృత్వంలో ఏడాది పొడవునా పట్టుకొని వాటిని మార్కెట్లో విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు.  మత్స్య సహకార సంఘాల్లో ఇప్పటివరకు కొత్తగా 973 మంది దరఖాస్తు చేసుకున్నారని పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. కొత్తవారికి ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

రాయితీపై పంపిణీ చేసిన ద్విచక్ర వాహనాలు


ముందుగా దరఖాస్తు చేసుకోవాలి

మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి

అర్హులైన మత్స్యకారులు సంఘం సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేపట్టాం. ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ప్రవేశపెట్టి అర్హులైన వారికి రాయితీపై వాహనాలు, కిట్లు, మహిళలకు ఆర్థిక సాయం చేస్తారు. బీమా సౌకర్యం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని