logo

జాతీయ స్థాయి పోటీలకు నలుగురి ఎంపిక

జిల్లా కేంద్రం మెదక్‌లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపికయ్యారు.

Updated : 30 Jan 2023 05:16 IST

విజేతలకు జ్ఞాపిక అందజేత

మెదక్‌ టౌన్‌: జిల్లా కేంద్రం మెదక్‌లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు జాతీయ స్థాయి క్రాస్‌కంట్రీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 27న ఓయూ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రాస్‌కంట్రీ పరుగు పోటీలు జరిగాయి. మెదక్‌ నుంచి ఆరుగురు 10 కి..మీ. పోటీల్లో పాల్గొనగా టి.నందిని-ప్రథమ, గంగ-ద్వితీయ స్థానాల్లో నిలిచారు. సరిత, బబితలు సైతం జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరు వచ్చే నెల 12న బెంగళూరులో జరుగనున్న ఆల్‌ ఇండియా క్రాస్‌కంట్రీ టోర్నీలో జిల్లా తరఫున పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్‌ వాసంతిపిళ్లై తెలిపారు. పీడీ ప్రియ, అధ్యాపకులు తదితరులు అభినందించారు.


యూత్‌ పార్లమెంట్‌కు ఇద్దరు..

రాష్ట్ర స్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీలకు గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎంపికైనట్లు ఎన్‌వైకే యువజన అధికారి రంజిత్‌రెడ్డి, కార్యక్రమ అధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీల్లో కళాశాల విద్యార్థినులు దివ్యరాణి (బీఎస్సీ- బీజడ్‌సీ) ప్రథమ, సౌజన్య (బీఎస్సీ బీజడ్‌సీ) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వీరు వచ్చే నెల 2న వర్చూవల్‌ పద్ధతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు ఫిబ్రవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం దక్కుతుందన్నారు. విజేతలకు రూ.2 లక్షలు, రూ.1.10 లక్షలు, రూ.లక్ష చొప్పున అందిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని