logo

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

మానసిక ఆందోళనతో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు చిరాగ్‌పల్లి ఏఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Published : 30 Jan 2023 02:56 IST

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: మానసిక ఆందోళనతో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నట్లు చిరాగ్‌పల్లి ఏఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. మొగుడంపల్లి మండలం గొడిగార్‌పల్లి గ్రామానికి చెందిన దండు రాహుల్‌(22) కొన్నాళ్లుగా మానసికంగా ఆందోళన చెందుతూ ఒంటిరిగా ఉంటున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం ఇంటి పరిసరాల్లోని షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో శవపరీక్ష అనంతరం కుటుంబీకులు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.


రైలు కిందపడి..

కోహీర్‌, న్యూస్‌టుడే: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పైడిగుమ్మల్‌ రైల్వే గేటు సమీపం 42/5 మైలురాయి వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... కోహీర్‌ పట్టణం భీంనగర్‌కాలనీకి చెందిన తలారి శ్రీనివాస్‌(30) పటాన్‌చెరు విద్యుత్తు ఉప కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఆర్థిక ఇబ్బందులతో స్థిరాస్తి వ్యాపారి..

దుండిగల్‌(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. మెదక్‌ జిల్లా మగ్థభూపతిపూర్‌ గ్రామానికి చెందిన భాస్కర్‌రావు కుమారుడు కిషోర్‌కుమార్‌ (34) కుటుంబ సభ్యులతో కలిసి గత కొంతకాలంగా బౌరంపేటలోని సింహపురికాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం స్వస్థలంలో బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తర్వాత తను ఒక్కడే శనివారం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం అతనిని కలిసేందుకు స్థానికంగా ఉండే స్నేహితుడు శ్రీకాంత్‌ వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటి తలుపులు తీయకపోవడంతో కిటికిలో నుంచి చూడగా కిష్రో్‌కుమార్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు బద్ధలుగొట్టి చూడగా అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. మృతుడి బావ చందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులపాలవ్వడంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని