logo

ఇసుక రవాణాకు అడ్డుకట్ట

ప్రభుత్వ అనుమతి ఉందని ఓ గుత్తేదారు హల్దీ వాగు నుంచి ఇసుకను ఇష్టారీతిన తరలించడంతో మండల పరిధి జానకంపల్లి, సంగాయిగూడ తండా గ్రామస్థులు గురువారం ఉదయం అడ్డుకున్నారు.

Published : 03 Feb 2023 01:03 IST

రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతి ఉందని ఓ గుత్తేదారు హల్దీ వాగు నుంచి ఇసుకను ఇష్టారీతిన తరలించడంతో మండల పరిధి జానకంపల్లి, సంగాయిగూడ తండా గ్రామస్థులు గురువారం ఉదయం అడ్డుకున్నారు. గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను అడిగితే స్పందించలేదని, గుత్తేదారులకు ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడంతో అగ్రహం వ్యక్తం చేశారు. కొంగోడు - మంబోజిపల్లి మార్గంలో రాస్తారోకో చేసి సదరు కాంట్రాక్టర్‌ లారీలను నిలిపి వేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. సామాన్యులకు అనుమతి ఇవ్వని అధికారులు, ప్రభుత్వ పనుల పేరుతో గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా తరలించి, అమ్ముకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న గ్రామీణ ఠాణా ఏఎస్‌ఐ వెంకటయ్య సిబ్బందితో అక్కడికి వెళ్లి మాట్లాడారు. ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలున్నా, వాహనాలను అడ్డుకోవడం చట్ట విరుద్ధమని గ్రామస్థులకు నచ్చజెప్పారు. వారు ససేమిరా అనడంతో వాగ్వాదం జరిగింది. చివరకు గ్రామస్థులు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని