logo

నర్సాపూర్‌ పురాధ్యక్షుడికి అవిశ్వాస గండం!

నర్సాపూర్‌ పురపాలక సంఘం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 8మంది కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావును గురువారం కలవడం చర్చనీయాంశమైంది.

Published : 03 Feb 2023 01:03 IST

మంత్రి హరీశ్‌రావును కలిసిన కౌన్సిలర్లు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: నర్సాపూర్‌ పురపాలక సంఘం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 8మంది కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావును గురువారం కలవడం చర్చనీయాంశమైంది. వీరంతా మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీయాదవ్‌పై అవిశ్వాసం పెట్టే విషయమై చర్చించారని విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగానే నోటీసు ఇచ్చే విషయమై నిర్ణయించారని తెలిసింది. భారాస నుంచి భాజపాలో చేరిన మురళీయాదవ్‌ను గద్దె దించేందుకు ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. నర్సాపూర్‌ పురపాలికలో 15మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో భారాస నుంచి గెలుపొందిన ఆరుగురు, ఇద్దరు స్వతంత్రులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అవిశ్వాసం ప్రవేశపెడితే మద్దతుగా సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎనిమిది మంది కౌన్సిలర్లు మంత్రికి హామీ ఇచ్చారని కొందరు నాయకులు తెలిపారు. మురళీయాదవ్‌ వెంట ఇద్దరు కౌన్సిలర్లు భాజపాలో చేరారు. అంతకుముందే భాజపా కౌన్సిలర్లు 4గురు గెలుపొందారు. ఆయనకు ఏడుగురి మద్దతు ఉంది. అవిశ్వాసం పెడితే ఇద్దరు స్వతంత్రులు కీలకం కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని