logo

మెట్టుదిగని యాజమాన్యం.. పట్టు వదలని కార్మికులు

జహీరాబాద్‌ సమీపంలోని ట్రైడెంట్‌ చక్కెర పరిశ్రమ కార్మికుల నిరసన గురువారంతో మూడో రోజుకు చేరింది.

Published : 03 Feb 2023 01:03 IST

ట్రైడెంట్‌ పరిశ్రమ ఎదుట నినాదాలు చేస్తున్న కార్మికులు

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ సమీపంలోని ట్రైడెంట్‌ చక్కెర పరిశ్రమ కార్మికుల నిరసన గురువారంతో మూడో రోజుకు చేరింది. రెండేళ్లుగా రావాల్సిన పీఎఫ్‌, ఎల్‌ఐసీ బకాయిలు దాదాపు రూ.2 కోట్లను ఒకేసారి చెల్లించాలని కోరుతూ కార్మికులు మూడు రోజుల క్రితం కర్మాగారం ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. విడతల వారీగా చెల్లిస్తామని, నిరసన విరమించాలని కర్మాగారం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం వరకు రూ.50లక్షలు విడుదల చేయడమే కాకుండా, గురువారం మరో రూ.25 లక్షలు విడదల చేస్తామని అధికారులు ప్రకటించినా కార్మికులు పట్టు వీడకుండా గురువారం తమ నిరసనను కొనసాగించారు. కార్మికులు రేయింబవళ్లు ప్రధాన ద్వారం ముందు బైఠాయించడంతో కర్మాగారంలోని ఉత్పత్తులను తరలించే లారీలు లోపలే నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు ప్రతిఘటించారు. వీరికి కార్మిక సంఘం నాయకుడు, భారాస జహీరాబాద్‌ మండల అధ్యక్షుడు ఎం.జి.రాములుతో పాటు.. పలువురు కార్మికులు మద్దతు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు