logo

జిల్లా గ్రంథాలయ బడ్జెట్‌ రూ.1.74 కోట్లు

జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్‌ రూ.1.74 కోట్లకు పాలకవర్గం ఏకగ్రీవంగా అమోదించింది. అనుమతి కోసం కేంద్ర కార్యాలయానికి పంపించారు.

Published : 04 Feb 2023 01:49 IST

మాట్లాడుతున్న చంద్రాగౌడ్‌, పాలకవర్గ సభ్యులు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్‌ రూ.1.74 కోట్లకు పాలకవర్గం ఏకగ్రీవంగా అమోదించింది. అనుమతి కోసం కేంద్ర కార్యాలయానికి పంపించారు. శుక్రవారం మెదక్‌ పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు చంద్రాగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించి ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెదక్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనానికి నిధులు సమకూర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఉద్యోగులతో సమీక్ష నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటామని, సహకారం అందిస్తామన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వంశీకృష్ణ మాట్లాడుతూ.. .ప్రస్తుతం వివిధ ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నందున గ్రంథాలయానికి అధిక సంఖ్యలో నిరుద్యోగులు వస్తారన్నారు. వారికి ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు.  అనంతరం తాత్కాలిక ఉద్యోగి కుమారుడి వైద్య ఖర్చులకు జమచేసిన రూ.70 వేలను విరాళంగా అందజేశారు. సమావేశంలో ఆ సంస్థ సభ్యులు సిద్దిరాములు, శ్రీనివాస్‌, విజయలక్ష్మి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌ రామేశ్వర్‌రావు, డీఈవో రమేష్‌కుమార్‌, డీపీవో సాయిబాబా, గ్రంథాలయ పాలకులు తదితరులు పాల్గొన్నారు.

* ఇటీవల మెదక్‌ పాలనాధికారిగా రాజర్షి షా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు చంద్రాగౌడ్‌ శుక్రవారం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలశారు. శాలువతో సన్మానించారు. మెదక్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా గ్రంథాలయ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని