logo

‘కాళేశ్వరం’తో సస్యశామలం: ఎంపీ

సాగునీటికి తండ్లాడిన తెలంగాణను కాళేశ్వరంతో సస్యశామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Published : 04 Feb 2023 01:49 IST

కూడవెల్లి, హల్దీ వాగుల్లోకి గోదావరి నీటిని విడుదల చేసిన నాయకులు

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి,

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఇంజినీరింగ్‌ అధికారులు, నాయకులు

గజ్వేల్‌, వర్గల్‌, న్యూస్‌టుడే: సాగునీటికి తండ్లాడిన తెలంగాణను కాళేశ్వరంతో సస్యశామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి, వర్గల్‌ మండలం అవుసులోనిపల్లి వద్ద హల్దీ వాగులోకి ఆయన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అనతికాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జలాలను బీడు పొలాల ధరి చేర్చారన్నారు. ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడి, కేసులు వేసిన వారే ఇప్పుడు సాగునీరు విడుదల చేయాలని కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో దేశం అధోగతి పాలవుతుందన్నారు. అసమానతలను నిలువరించే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. అంతకుముందు గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన  ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిరాం, ఎస్‌ఈ వేణు, డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా ఛైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, ప్యాక్స్‌ ఛైర్మన్‌ వెంకటేశంగౌడ్‌, బల్దియా ఉపాధ్యక్షుడు జకీ, జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, ఆత్మకమిటీ ఛైర్మన్‌ ఊడెం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

వడివడిగా తరలుతున్న నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని