logo

చుక్‌ చుక్‌ బండి.. మార్చిలో వస్తోందండి

జిల్లా ప్రజలకు త్వరలోనే ప్రయాణికుల రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించడంతో ఆ కల నెరవేరనుంది.

Published : 04 Feb 2023 01:49 IST

సిద్దిపేట, గజ్వేల్‌: జిల్లా ప్రజలకు త్వరలోనే ప్రయాణికుల రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించడంతో ఆ కల నెరవేరనుంది. 2006-07లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు తలపెట్టింది. అనంతరం తీవ్ర జాప్యం నెలకొంది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత పనులు పట్టాలెక్కాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలను అనుసంధానించేలా రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ మండలం కొడకండ్ల వరకు 41 కిలోమీటర్ల మేర రైలు మార్గం పూర్తయింది. గత ఏడాది జూన్‌లో గజ్వేల్‌ వరకు గూడ్స్‌ రైళ్ల సేవలు మొదలయ్యాయి. కొడకండ్ల వరకు సన్నాహక పరుగు పూర్తయింది. ప్రస్తుతం కుకునూర్‌పల్లి మండల పరిధిలో దుద్దెడ వరకు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌, సిద్దిపేటలో స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. మార్చిలో దుద్దెడ వరకు రైలు కూత వినిపించటమే లక్ష్యంగా రైల్వే, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు