logo

ఉపాధి హామీలో రూ.9.64లక్షల అవకతవకలు

తూప్రాన్‌ మండలంలోని ఉపాధి హామీ పనులకు సంబంధించిన శనివారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ నిర్వహించారు.

Published : 05 Feb 2023 02:04 IST

సామాజిక తనిఖీలో డీఆర్డీవో ఇన్‌ఛార్జి పీడీ విరోజ, అధికారులు

తూప్రాన్‌, న్యూస్‌టుడే: తూప్రాన్‌ మండలంలోని ఉపాధి హామీ పనులకు సంబంధించిన శనివారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ నిర్వహించారు. 14 గ్రామాల పరిధిలో ఉపాధిహామీలో రూ.9.64 లక్షల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించగా, వాటి రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఆర్డీవో ఇన్‌ఛార్జి పీడీ విరోజ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. మండలంలోని మల్కాపూర్‌లో అత్యధికంగా రూ.5 లక్షలకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై గ్రామానికి చెందిన పలువురు అధికారులను నిలదీశారు. నగదు రికవరీకి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పనులు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులకు రూ.5500 జరిమానా విధించారు. ఉపాధిహామీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజేందర్‌రెడ్డి, ఏపీడీ బాలయ్య, ఎంపీడీవో అరుంధతి, ఏపీవో సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని