logo

బకాయిలకు ఎదురుచూపులు

మహిళా సంఘాల సభ్యులు నెలనెలా పొదుపు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

Published : 05 Feb 2023 02:04 IST

పట్టణాల్లో మహిళా సంఘాలకు అందని ‘పావలా వడ్డీ’

సంగారెడ్డి పట్టణం నారాయణరెడ్డి కాలనీలో సమావేశమైన సభ్యులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, జోగిపేట: మహిళా సంఘాల సభ్యులు నెలనెలా పొదుపు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సభ్యుల అవసరాలకు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా రుణాలు చెల్లిస్తున్నారు. ప్రతినెలా సక్రమంగా బ్యాంకులకు రుణ వాయిదాలు చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం రూ.5లక్షల వరకు పావలా వడ్డీని తిరిగి చెల్లించాలి. ఇంత వరకు బాగానే ఉన్నా.. రూ.21.16 కోట్ల పావలా వడ్డీ బకాయిలు జిల్లాలో పేరుకుపోయాయి. వాటికోసం పట్టణాల్లోని మహిళలు ఏళ్లుగా ఎదురుచూడాల్సిన పరిస్థితిపై కథనం.


2018 నుంచి..

జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, ఐడీఏ బొల్లారం పురపాలక సంఘాలున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 179 వార్డులున్నాయి. 5,108 పట్టణ కమిటీలుండగా.. అందులో 50,714 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. 2018 నుంచి 2022 వరకు సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్‌, అందోలు-జోగిపేట పురపాలికల్లోని సంఘాలకు, 2019-2022 వరకు అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, బొల్లారం, నారాయణఖేడ్‌ పురపాలికల పరిధిలోని వాటికి బకాయిలు చెల్లించాల్సి ఉంది.


ప్రభుత్వానికి నివేదిక అందజేశాం

- ఆర్‌.గీత, మెప్మా పీడీ

పట్టణాల్లోని మహిళా సంఘాలకు అందాల్సిన పావలా వడ్డీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించగానే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని