logo

గోల్డెన్‌ అవర్‌ ఎంతో కీలకం: ఎస్పీ

ప్రమాదం జరిగిన గంటలోపు బాధితుడికి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉంటుందని, ఆ సమయమే గోల్డెన్‌ అవర్‌ అని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.

Published : 07 Feb 2023 04:14 IST

చల్మెడలో కంట్రోల్‌ రూంను ప్రారంభిస్తున్న రోహిణి ప్రియదర్శిని, చంద్రభాను, రంజిత్‌ తదితరులు

రామాయంపేట: ప్రమాదం జరిగిన గంటలోపు బాధితుడికి చికిత్స అందిస్తే బతికే అవకాశం ఉంటుందని, ఆ సమయమే గోల్డెన్‌ అవర్‌ అని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. రామాయంపేట పట్టణంలోని ఓ వేడుక మందిరంలో ‘యాక్సిడెంట్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌’ పేరిట విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, దాబా యాజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు అంబులెన్సు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఘటనల్లో మృతుల సంఖ్య తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు భద్రతా విభాగం డీఎస్పీ చంద్రభాను, వైద్యుడు మధుసూదన్‌లు మాట్లాడారు. క్షతగాత్రులకు చేయాల్సిన సపర్యలు, ఆసుపత్రికి తరలించే విధానాన్ని వివరించారు. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌ తదితరులు ఉన్నారు. అంతకుముందు నిజాంపేట మండలం నగరంలో ఎనిమిది, చల్మెడలో దాతలు సహకారంతో రూ.5.14 లక్షలతో ఏర్పాటు చేసిన 32 కెమెరాలు, కంట్రోల్‌ రూం ప్రారంభించారు. ఎంపీపీ సిద్దిరాములు, సర్పంచి నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రెడ్డి, ఉపసర్పంచి రమేష్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని