logo

కార్పొరేట్లకు దోచి పెడుతున్న కేంద్రం: కాంగ్రెస్‌

సామాన్యుల కష్టార్జితాన్ని తమ మిత్రులకు, కార్పొరేట్లకు కేంద్రం దోచిపెడుతోందని పీసీసీ సభ్యుడు మామిళ్ళ ఆంజనేయులు విమర్శించారు.

Published : 07 Feb 2023 04:14 IST

రహదారిపై బైఠాయించిన నేతలు

మెదక్‌ అర్బన్‌: సామాన్యుల కష్టార్జితాన్ని తమ మిత్రులకు, కార్పొరేట్లకు కేంద్రం దోచిపెడుతోందని పీసీసీ సభ్యుడు మామిళ్ళ ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మెదక్‌ పట్టణంలోని ఎస్‌బీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని పట్టణ ఠాణాకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలు దేశానికి గర్వకారణమని, కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించిన సొమ్మును వాటిల్లో దాచి పెట్టుకున్నారని చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు శ్యాంరెడ్డి, శంకర్‌, గోవింద్‌, లింగంగౌడ్‌, ఆవుల గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఇస్మాయిల్‌, ఆహ్మద్‌, నజీర్‌, మన్సూర్‌ తాహేర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని