logo

అనాథ గురుకులాల సాధనకు గజ్వేల్‌ నుంచే ఉద్యమం: మంద కృష్ణ

అనాథ పిల్లల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి  ఆదుకుంటామని హామీనిచ్చి మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వంపై సీఎం నియోజకవర్గ గజ్వేల్‌ నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.

Published : 07 Feb 2023 04:14 IST

మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ, జిల్లా ఇన్‌ఛార్జులు, నాయకులు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: అనాథ పిల్లల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి  ఆదుకుంటామని హామీనిచ్చి మాట తప్పిన తెలంగాణ ప్రభుత్వంపై సీఎం నియోజకవర్గ గజ్వేల్‌ నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. సోమవారం ఆయన కార్యకర్తలతో కలిసి గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మొదటి గురుకులాన్ని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లలకు అన్నితానై ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రివర్గ ఉప సంఘం తరఫున మాట ఇచ్చిన మంత్రి కేటీఆర్‌ ఇద్దరూ ఏడు సంవత్సరాలు దాటిపోతున్నా హామీలు నిలుపుకోలేదన్నారు. అనాథ చిన్నారులు రాష్ట్రంలో సమారు 10 లక్షల మంది ఉన్నారన్నారు. ఈనెల 15న అనాథలతో కలసి గజ్వేల్‌లో దీక్ష చేపడుతామన్నారు. ఎమ్మార్పీఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి యాదగిరి, జిల్లా ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌, కో-కన్వీనర్‌ ముండ్రాతి కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని