logo

వసతి గృహాల్లో కనీస వసతులు కరవు : ఏబీవీపీ

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరు చేస్తామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

Published : 07 Feb 2023 04:18 IST

పట్టణంలో ర్యాలీ..

సంగారెడ్డి అర్బన్‌: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరు చేస్తామని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ జిల్లా సమ్మేళనం సందర్భంగా ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనకు అలుపెరగని ఉద్యమం చేసిన చరిత్ర ఏబీవీపీకి ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు చదువు హామీ నీటి మూటగానే మిగిలిందని ఆరోపించారు. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేరన్నారు. దళితులకు, మహిళలకు, యువతులకు రక్షణ లేదని విమర్శించారు. అంతకుముందు ఓ ఫంక్షన్‌ హాల్‌లో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్వాగత సమితి అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది హరీశ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, కళింగ కృష్ణకుమార్‌, జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ అనిల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజ, ప్రాంత సహా సంఘటన కార్యదర్శి లవన్‌, ఎస్‌ఎఫ్‌టీ రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌, విభాగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌, ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆకాశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు