logo

‘కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ పేదల పక్షమే’

కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడు పేదప్రజల పక్షమే వహిస్తుందని కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్‌ గ్రామాల్లో పార్టీ చేపట్టిన ‘హాథ్‌ సే.. హాథ్‌ జోడో’ కార్యక్రమం నిర్వహించారు.

Published : 08 Feb 2023 02:03 IST

రాంతీర్థంలో యాత్ర గురించి వివరిస్తున్న ప్రభాకర్‌రెడ్డి, బాలకృష్ణ, తదితరులు

పాపన్నపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడు పేదప్రజల పక్షమే వహిస్తుందని కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలం రాంతీర్థం, ముద్దాపూర్‌ గ్రామాల్లో పార్టీ చేపట్టిన ‘హాథ్‌ సే.. హాథ్‌ జోడో’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విషయాలను వివరించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు మద్దతు ధర పెంచుతామన్నారు. కుటుంబంలో అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ సభ్యులు మ్యాడం బాలకృష్ణ, ఆంజనేయులు, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కిసాన్‌సెల్‌ జిల్లా ప్రధానకార్యదర్శి నిటాలక్షప్ప, పార్టీ మండలాధ్యక్షుడు గోవింద్‌ నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు రమేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌, బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌, మైనార్టీ మండలాధ్యక్షుడు కలీం తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని