logo

ప్రభుత్వ బడి.. ప్రమాణాల ఒరవడి!

ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎనిమిది నెలల పాటు పాఠశాలల్లో చేపట్టిన బోధనతో పాటు.. మరో రెండు నెలలు ఏం చేయాలో ప్రణాళిక రూపొందించేందుకు సముదాయ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Published : 08 Feb 2023 02:03 IST

పాఠశాల సముదాయ సమావేశాల నిర్వహణకు ఆదేశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎనిమిది నెలల పాటు పాఠశాలల్లో చేపట్టిన బోధనతో పాటు.. మరో రెండు నెలలు ఏం చేయాలో ప్రణాళిక రూపొందించేందుకు సముదాయ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వీటితోపాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు కూడా నిర్వహించేందుకు జిల్లాలో కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులు ఈ సమావేశానికి తప్పని సరిగా హాజరు కావాలని సూచించారు.

పాఠ్యాంశాల వారీగా శిక్షణ..

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు పాఠ్యంశాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 847 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత, 203 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి కాంప్లెక్స్‌ పరిధిలోని సమావేశంలో పాల్గొనాలి. మొత్తం 4,892 మంది ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వీటిల్లోనే తొలిమెట్టు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం సజావుగా అమలు చేస్తున్న పాఠశాలలను గుర్తించి వారు ఏ విధంగా అమలు చేస్తున్నారో తోటి ఉపాధ్యాయులకు వివరిస్తారు. ఇందులో వెనుకబడిన బడులను గుర్తించి, ఎందుకు వెనకబడ్డారో కూడా పరిశీలించి సూచనలు చేస్తారు. పాఠశాలలు రూపొందించే సంచికల వినియోగం, ప్రశ్నపత్రాలు, తదితర వాటిపై చర్చించి రెండు నెలల పాటు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఎలా సన్నద్ధం చేయాలో కీలకంగా చర్చిస్తారు. ప్రశ్నపత్రాలు ఎలా తయారు చేయాలో కూడా సూచిస్తారు.


విద్యార్థుల ప్రగతి పరిశీలన: వెంకటేశం, సెక్టోరియల్‌ అధికారి

ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతిని పరిశీలిస్తారు. ఎందులో వెనుకబడ్డారో తెలుసుకుని పురోగతి సాధించేందుకు ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తారు. వీటిని పూర్తిగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని