కార్యకర్తపై భాజపా నేత బాబూమోహన్ పరుష పదజాలం
ప్రపంచ స్థాయి నేతను.. నువ్వెంత నీ బతుకెంత అంటూ భాజపా కార్యకర్తపై మాజీ మంత్రి, అందోలు మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ చరవాణిలో సంబోధించిన వ్యాఖ్యలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వ్యాఖ్యలు
జోగిపేట టౌన్: ప్రపంచ స్థాయి నేతను.. నువ్వెంత నీ బతుకెంత అంటూ భాజపా కార్యకర్తపై మాజీ మంత్రి, అందోలు మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ చరవాణిలో సంబోధించిన వ్యాఖ్యలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన వెంకటరమణ అందోలు నియోజకవర్గ కార్యకర్త. భాజపా రాష్ట్ర నాయకుడు బాబూమోహన్‌కు ఆయన ఫోన్ చేసి మీతోకలిసి పార్టీలో పనిచేస్తానని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆయన దూషించడం మొదలు పెట్టారు. నేను మంత్రిగా ఉన్నప్పుడే అందోలును అభివృద్ధి చేశానని, నువ్వెంత అని, ఫోన్ పెట్టేయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఎవరు.. నా తమ్ముడు అంటూ.. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించిన మాటలు రికార్డయ్యాయి. ఈ విషయమై బాబూమోహన్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ‘ఆ మాటలు నావి కావు... నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కావాలనే ఓ రాజకీయ నాయకుడు బురదజల్ల్లే ప్రయత్నమని అనుకుంటున్నా. రమణ అనే కార్యకర్తను దూరం పెట్టి దాదాపు రెండేళ్లవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడతా’నన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Suryakumar Yadav: మూడుసార్లు గోల్డెన్ డక్.. సూర్యకుమార్ పేరిట ఓ చెత్త రికార్డు
-
Movies News
NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా